ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ప్రదర్శన - nellore

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని వీఆర్​సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.

నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

By

Published : Jul 31, 2019, 7:57 PM IST

నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
నెల్లూరు​లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​(ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. నగరంలోని వీఆర్​సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు కలెక్టర్ కార్యలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న తోపులాటలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం విద్యార్థులు కార్యాలయంలోకి వెళ్లి ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details