నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఇందిరా నగర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పురపాలక ప్రాథమికోన్నత పాఠశాల 8 ఏళ్ల క్రితం 52 మంది విద్యార్థులతో అరకొర వసతులతో ఉండేది. ప్రధానోపాధ్యాయుడు గోవిందయ్య పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వేలకు వేలు ఫీజులు కట్టి కార్పోరేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివించటానికి ఇబ్బంది పడే తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం కలిగించాడు. స్థానిక అధికారుల సహకారంతో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాడు. 52 మంది విద్యార్థుల నుంచి 370మంది విద్యార్థులు వచ్చేలా శ్రమించాడు. ఈ పాఠశాలకు ఉత్తమ పాఠశాల, స్వచ్ఛ పాఠశాల అవార్డులు వచ్చేలా కృషిచేశాడా ఉపాధ్యాయుడు.
ప్రధానోపాధ్యాయుడి కృషి...ఆదర్శ పాఠశాలగా మార్పు - ప్రధానోపాధ్యాయుడి కృషి...ఆదర్శ పాఠశాలగా మార్పు
విద్యార్థులకు చదవునేర్పించటంతో తమ బాధ్యత తీరిపోతుంది అనుకుంటాడు...ఏ ఉపాధ్యాయుడైనా....కానీ ఓ ఉపాధ్యాయుడు మాత్రం అందుకు భిన్నం. మామూలు పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి చేర్చాడు. ఇంతకి ఎవరా ఉపాధ్యాయుడు...ఎక్కడ ఆ పాఠశాల?
ఆదర్శ పాఠశాల