Dangerous Boat Ride: నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాలెం సమీపంలోని సముద్ర తీరంలో.. నిబంధనలను అతిక్రమించి కొందరు బోటు షికారు చేశారు. ముసునూరుకు చెందిన 9 మంది.. బోటులో సముద్రంలో కొంత దూరం వెళ్లాక అది మొరాయించడంతో భయాందోళకు గురయ్యారు. 112 నంబరుకు కాల్ చేయడంతో.. పోలీసులు వారిని సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. తామంతా సరదాగా విహరించడానికి వచ్చామని వారు తెలిపారు.
సరదాగా సముద్రంలో షికారు.. మధ్యలో ఆగిన బోటు - నెల్లూరు జిల్లాలో ప్రమాదకరమైన పడవ ప్రయాణం
Dangerous Boat Ride: సరదాగా విహరించడానికి వచ్చిన కొందరు.. నెల్లూరు జిల్లాలోని చెన్నాయపాలెం సమీపంలోని సముద్ర తీరంలో నిబంధనలు అతిక్రమించి బోటు షికారు చేశారు. కానీ కాసేపటికి అది పనిచేయడం ఆగిపోవడంతో.. భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. క్షేమంగా తీరానికి తీసుకొచ్చారు.
ప్రమాదకర బోటు షికారు