దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...నెల్లూరు జిల్లా ఉదయగిరి శివాలయంలోని పార్వతి దేవి అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజు కావడంతో.... భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఉదయగిరి శివాలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి శివాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పార్వతీదేవి అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయగిరి శివాలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
దసరా వరకు ప్రతి రోజు అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకుడు అనిల్ శర్మ తెలిపారు. అమ్మ వారికి నిత్యాభిషేకాలు, కుంకుమార్చన, పుష్పార్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి:
జగన్మాత దుర్గమ్మకు సీపీ దంపతుల తొలి సారె సమర్పణ