విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, ఉన్నత చదువులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారని ఆయన వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొత్తూరు-అంబాపురంలో నిర్వహించిన శాలివాహన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు పట్టుదలతో అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు వెళ్లాలని సూచించారు.
డాక్టర్ కోర్సు చదివానని, ఉద్యోగం కోసం నారాయణ హాస్పిటల్ కి వెళ్తే వారు తిరస్కరించారని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో నారాయణపైనే పోటీ చేసి గెలుపొందానన్నారు.
'శాలివాహన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు'
నెల్లూరు జిల్లా అంబాపురంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శాలివాహన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి అనిల్ కుమార్ అందించారు.
'శాలివాహన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు'
ఇవీ చూడండి-భీమా కోరెగావ్ స్ఫూర్తితో పోరాడాలి: మందకృష్ణ