ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉదయగిరిలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ మాజీ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ రవీంద్రకు వినతి పత్రం అందజేశారు.
"విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి" - udaygiri
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
"విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి"