ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ దళిత, గిరిజనుల ఆందోళన

నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పుళ్ళనీళ్లపల్లి గ్రామానికి చెందిన 30 మంది దళిత, గిరిజనులు ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను కొందరూ కాజేశారని ఆరోపించారు.

By

Published : Nov 19, 2020, 10:15 PM IST

Dalitulu_andolana
Dalitulu_andolana

దళిత, గిరిజన పేదలకు ఇచ్చిన భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ 30 కుటుంబాలు ఆందోళనకు దిగాయి. నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పుళ్ళనీళ్లపల్లి గ్రామ దళితులు, గిరిజనులకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో మనిషికి ఎకరా చొప్పున 30 మందికి భూమి దక్కింది. అయితే అప్పట్నుంచి అవి బీడు భూములుగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ పొలాలకు అన్ని సౌకర్యాలు సమకూర్చడంతో వాటిపై కొంత మంది బడా నాయకుల కన్ను పడింది. లబ్ధిదారులమైన తమకు మాయమాటలు చెప్పి కొందరూ భూములు స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి... తమ పోలాలు తమకే దక్కేలా చూడాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details