ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rmp's Rape Attempt : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే అత్యాచారానికి యత్నించాడు.. - కేసు నమోదు చేసుకున్న ఎస్సై ప్రభాకర్

అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ గిరిజన మహిళ పట్ల ఆర్​ఎంపీ అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rmp's Rape Attempt : మత్తు మందుతో గిరిజన మహిళపై వైద్యుడి కీచకత్వం
Rmp's Rape Attempt : మత్తు మందుతో గిరిజన మహిళపై వైద్యుడి కీచకత్వం

By

Published : Jun 10, 2021, 9:11 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామంలోని ఓ ఆర్​ఎంపీ.. గిరిజన మహిళపై అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. అనంతసాగరానికి చెందిన ఓ గిరిజన వివాహిత అనారోగ్యం బారిన పడి ఆర్​ఎంపీ వద్దకు వెళ్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందంటే..

నీరసంగా ఉండటం వల్ల ఓ గిరిజన మహిళ వైద్యం కోసం బుధవారం భర్తతో కలిసి ఆర్​ఎంపీ తుపాకుల సుభ్రమణ్యం దగ్గరకు వెళ్లింది. ఆ మహిళకు బీపీ తగ్గిందని మందులు రాసి ఇచ్చాడు. ఈ క్రమంలో మహిళ భర్త మందుల కోసం వెళ్లగా.. ఆ వైద్యుడి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. ఇంజక్షన్​ ఇవ్వడంతో స్పృహ తప్పానని, అనంతరం ఆర్​ఎంపీ తనపై అత్యాచారానికి యత్నించాడని బాధిత మహిళ పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : 'మూడో దశ ముప్పుపై స్పష్టత లేదు.. అయినా మేం సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details