సోమశిల హైలెవల్ కెనాల్ పనుల పరిశీలన - somaseela canal
సోమశిల హైలెవల్ కెనాల్ పనులను ఆర్డీవో ఉమావేవి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉమాదేవి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజులపాడు వద్ద జరుగుతున్న సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి పరిశీలించారు. పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైలెవల్ కెనాల్ పనులకు ఇసుక కావాలని నివేదించినట్టు ఆమె తెలిపారు.పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ డీవీ సుధాకర్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు ఉన్నారు.