రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది: సీపీఐ కార్యదర్శి మధు - CRITISISED
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని సీపీఐ( ఎం) కార్యదర్శులు ధ్వజమెత్తారు.
నెల్లూరు నగరం నర్తకి సెంటర్ వద్ద రాజకీయ ప్రత్యామ్నాయంపై జనసేన, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన నాయకులతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ లు హాజరయ్యారు.రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన, వామపక్ష పార్టీలు మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పసుపు కుంకుమ, ఫించన్లు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. అసెంబ్లీకే పోని వైకాపా ఎమ్మెల్యేలు నెల నెల జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదలకు న్యాయం జరగాలన్నా రానున్న ఎన్నికల్లో జనసేన, వామపక్ష పార్టీలను బలపరచాలని పిలుపునిచ్చారు.