ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనులు పూర్తయ్యేదెన్నడు? సమస్య తీరేదెన్నడు?'

నగరానికి మధ్యలో రైల్వే ట్రాక్... పట్టాలు దాటేందుకు వంతెన లేదు. నెల్లూరు నగరంలోని విజయమహాల్ గేటు వద్ద నెలకొన్న ఈ పరిస్థితితో ప్రజలు నిత్యం పడే ఇబ్బందులు ఎన్నో. విస్తరణ పనుల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

By

Published : Dec 24, 2019, 10:41 AM IST

railway-gate-problems-in-nellore
railway-gate-problems-in-nellore

విజయమహల్ రైల్వే గేటు వద్ద ప్రజల అవస్థలు

నెల్లూరు నగరంలో ప్రధాన కూడలి విజయమహల్ గేటు. విశాలమైన ఈ కూడలి నుంచే పది డివిజన్ కాలనీల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో పరిస్థితి దారుణంగా ఉంది. రైల్వేగేటు దాటడానికి గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తుంది.

మూడో రైల్వే లైన్ నిర్మాణంతో సమస్య మొదలైంది. గతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉండేది. రైల్వే గేటు వేసినా వంతెన కింది నుంచి వెళ్లేవారు. కొన్ని నెలలుగా అండర్ బ్రిడ్జి మూసివేశారు. రైల్వే గేటు దాటి రావాలంటే ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు.

రైల్వే లైన్ నెల్లూరు నగరానికి మధ్యలో ఉంటుంది. ఆసుపత్రులు ఉండే పొగతోట రైల్వే గేటును ఆనుకుని ఉంటుంది. బాలాజీ నగర్, ఎన్టీఆర్ కాలనీల నుంచి ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే ఈ గేటు దాటి రావాలి. పని వేలల్లో వేల వాహనాలు గేటుకు రెండువైపులా నిలిచిపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి రైలు వస్తున్నా ట్రాక్ పై వాహనాలు నిలిచిపోయి ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ నియంత్రించాలని కోరుతున్నారు. రైల్వే పనులు పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'ఉగ్రవాదంపై భారత్​-రష్యా ఉమ్మడి పోరు'

ABOUT THE AUTHOR

...view details