ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేలుళ్లతో జనంలో భయం.. పట్టించుకోని యంత్రాంగం - turpu pundla

కనుచూపు మేరలో జరుగుతున్న మైనింగ్‌.. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పేలుళ్లకు భయపడి అర్థరాత్రులు చిన్నపిల్లలు లేచి ఏడుస్తున్నారు. పేలుడు ధాటికి కదులుతున్న ఇళ్లల్లో ఉండాలంటేనే జనం భయపడుతున్నారు.

మైనింగ్

By

Published : Jul 14, 2019, 5:11 PM IST

పేలుతున్న మైనింగ్‌ బాంబులు... బెదిరిపోతున్న ప్రజలు...

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పుపూండ్ల గ్రామంలోని ఎస్ సి కాలానికి అతి దగ్గరగా జరుగుతున్న మైనింగ్‌.. జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పేలుళ్లు.. తమకు నిద్ర లేకుండా చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తవ్వకాలు జరిగినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదని... ఇప్పుడు మాత్రం ఆధునిక పరికరాలతో లోతుగా తవ్వడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

నివాసాలకు దగ్గరలో పేలుతున్న బాంబులతో ఇళ్లు పగుళ్లు వస్తున్నాయని... స్లాబులు పెచ్చులు ఊడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. నివాసాలు కూలిపోతాయనే భయం కలుగుతోందంటున్నారు ప్రజలు.

ఎంతమంది అధికారులకు చెప్పిన న్యాయం జరగడం లేదని ఎలాగైనా ఈ మైనింగ్ ఆపి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు తూర్పుపూండ్ల గ్రామస్తులు. అధికారులను అడిగితే.. మైనింగ్ కు అనుమతులు ఉన్నాయని.. తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.

ఇది కూడా చదవండి

పోలీస్​నంటూ వసూళ్లు...ఎట్టకేలకు కటకటాల్లోకి..

ABOUT THE AUTHOR

...view details