పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిరసన చేపట్టారు. గాంధీబొమ్మ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డుల ప్రదర్శించారు. సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారిపై అదనపు భారం పడుతోందని.., ప్రభుత్వం స్పందించి ఇంధనం ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ నెల్లూరులో ఆందోళన - నెల్లూరులో నిరసన
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ.. నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ప్రభుత్వం స్పందించి ఇంధనం ధరలు తగ్గించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ నెల్లూరులో ఆందోళన