ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటగిరిలో పోలింగ్ కేంద్రాలకు తరులుతున్న ఓటర్లు - nellore district latest news

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు... నెల్లూరు జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వెంకటగిరి, తాళ్వాయిపాడు కేంద్రాల్లో ఓటు వేసేందుకు జనం బారులు తీరుతున్నారు.

polling started in nellore
నెల్లూరులో పోలింగ్​ ప్రారంభం

By

Published : Apr 17, 2021, 8:13 AM IST

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిమిత్తం.. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే జనం తరలివస్తున్నారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు పోలింగ్ కేంద్రంలో ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. పోలింగ్​ కేంద్రాల వద్ద కొవిడ్​ నిబంధనలు పాటించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

ఉదయం ఎండ తక్కువగా ఉంటుందని.. బంగారుపేట, బీసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, రాజా వీధుల్లోని వృద్ధులు ఎక్కువగా ఓటు వేసేందుకు వస్తున్నారు. పోలింగ్​ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details