మా డబ్బులు మాకు ఇవ్వండి.. బాధితులు నిరసన - darna
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహనాల యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తమకు రావల్సిన డబ్బులు చెల్లించాలంటూ బాధితులు నెల్లూరు జిల్లా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నికల సమయంలో కార్లు ఏర్పాటు చేశామని...అప్పులు చేసి ఎన్నికల విధులకు వచ్చిన అధికారులు, సిబ్బందికి భోజనం పెట్టామన్నారు. ఎన్నికల ముగిసి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు నగదు చెల్లించకుండా తమను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు సంబంధించిన ఫైనాన్స్ వాయిదాలు, ఇన్సూరెన్స్ లు, డ్రైవర్లకు జీతాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని బాధితులు తెలిపారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.