ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడికెడు బియ్యంతో ప్రారంభం.. వేల మందికి ఆపన్నహస్తం

ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో 89 ఏళ్ల క్రితం ప్రారంభించిన అన్నదాన సమాజం... ఇప్పుడు మహావృక్షంలా మారింది. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, పేదలకు ఉచిత భోజనం వంటి కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఏడుగురు సభ్యులతో మొదలైన ప్రయాణం... నేడు 3 వేల మందికి చేరింది.

ట్రస్టు భవనం

By

Published : May 9, 2019, 11:15 PM IST

89 ఏళ్లుగా ప్రజాసేవ
నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో 1930లో ఆర్యవైశ్యులు కలిసి పాండురంగ అన్నదాన సమాజం పేరుతో ఓ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగా భోజనం అందించాలనే లక్ష్యంతో ఆ నాడు ఈ సంస్థను పారంభించారు. పిడికెడు బియ్యం, నిత్యవసరాలు సేకరణ అనే నినాదంతో ప్రతి రోజు ఆర్యవైశ్య కుటుంబాల వద్దకు ఏడుగురు సభ్యులు వెళ్లేవారు. దాతల సాయంతో అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించేవారు. నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేస్తున్నందున... సంస్థపై నమ్మకం కుదిరి నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్య కుటుంబాలు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం సభ్యుల సంఖ్య మూడు వేలకు చేరి... నిధులకు కొరతే లేకుండా పోయింది. సంస్థకు అనేక మంది స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో కల్యాణ మండపాలు నిర్మించి... పేదలందరికి తక్కువ ధరకే శుభకార్యాలు నిర్వహించుకనే వీలు కల్పిస్తోంది.

ఎన్నో సేవా కార్యక్రమాలు

పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు... వివిధ రంగాల్లోకి ప్రజలకు సేవలందిస్తోంది. రాష్ట్రంలో పేద విద్యార్ధులు వీరిని సంప్రదిస్తే ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ప్రతి రోజు వందమందికిపైగా ఉచిత భోజనం చేస్తారు. నగరంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ప్రతి ఏడాది ప్రతిభ కలిగిన 40మంది విద్యార్ధులకు... ఒక్కొక్కరికి 15 వందల రూపాయలు అందజేస్తారు. 2003లో జొన్నవాడలో భక్తులకోసం వసతి గృహాన్ని నిర్మించారు. ఇవేకాక కోటి 50 లక్షల రూపాయల ఖర్చుతో మార్చురీ నిర్మించి.. అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 1943లో సంస్థను రిజిస్ట్రార్ చేసి.. మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆర్యవైశ్యులకే కాకుండా పేదలందరికి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి అభినందనలు పొందుతోంది.

ABOUT THE AUTHOR

...view details