ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సోమిరెడ్డి, బీదాల సహకారంతో తెదేపాను పటిష్ఠ పరుస్తాం'

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్రల సహకారంతో వైకాపా ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్ఠ పరుస్తామని నెల్లూరు తెదేపా నాయకులు వెల్లడించారు. సోమిరెడ్డి, బాలకృష్ణ, బీదాలకు పార్టీ పదవులు కట్టబెట్టటం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమిరెడ్డి, బీదాల సహకారంతో తెదేపాను పటిష్ఠ పరుస్తాం
సోమిరెడ్డి, బీదాల సహకారంతో తెదేపాను పటిష్ఠ పరుస్తాం

By

Published : Oct 20, 2020, 4:12 PM IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలకు తెదేపా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించటంపై నెల్లూరు జిల్లా తెదేపా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. సోమిరెడ్డి, బీదాల సహకారంతో వైకాపా ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్ఠ పరుస్తామని నాయకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details