నేటి నుంచి పదిరోజుల పాటు రెవెన్యూ సదస్సులు - nellore
నేటి నుంచి జూన్ 7వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సుల్లో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొననున్నారు.
![నేటి నుంచి పదిరోజుల పాటు రెవెన్యూ సదస్సులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3411262-422-3411262-1559102538315.jpg)
nellore_revenue_sadassulu
ఇవాళ నుంచి జూన్ 7 వరకు జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 10 వేల 400 మంది కౌలు రైతులు ఉన్నారని..కౌలు కార్డులు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. 8వేల 670 మంది కౌలు రైతులకు కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు.
కౌలు రైతులకు కొత్త కార్డులు ఇస్తున్నాం