ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండే ఎండలు... ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు! - నెల్లూరు

బయటకొస్తే ఎండ సుర్రుమంటోంది. ఏసీలు, కూలర్లు కాస్త ఉపశమనమిచ్చినా... ప్రకృతి కలిగించే ఉపశమనమ వేరు. నెల్లూరు నగరంలోని పార్కుల్లో నగర వాసులు ఇప్పుడు అదే అనుభూతి పొందుతున్నారు. సాయంత్రం వెళల్లో చల్లదనం కోసం కుటుంబ సమేతంగా పార్కులకు వెళ్తూ..సేద తీరుతున్నారు.

nellore_parks_full_demand_in_evening

By

Published : Jun 2, 2019, 12:00 AM IST

మండె ఎండల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

నెల్లూరు నగరంలోని పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు స్థానిక ప్రజలు పార్కులకు వెళ్లి సేద తీరుతున్నారు. చల్లదనం కోసం సాయంత్రం వేళల్లో కుటుంబ సమేతంగా వెళ్తూ ఉత్సాహాంగా గడుపుతున్నారు.

బహుళ అంతస్థుల భవనాలు...పెరుగుతున్న జనాభాతో నెల్లూరు నగరం ఇరుకుగా మారింది. నగరం చుట్టూ ఎక్కడా చెట్లు కనిపించని పరిస్థితి. ఓ వైపు భానుడి భగభగలకు తోడు వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో నిర్మించిన పార్కులు ప్రజలకు చల్లదనాన్ని పంచుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డు మార్గంలో అనేక పార్కులు అభివృద్ధి చేశారు. సండే మార్కెట్, మాగుంట లేఅవుట్ రోడ్డు, బైపాస్ రోడ్డు, స్టోనస్ పేటలో ఉన్న అనేక పార్కుల్లో సేదతీరేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నారు.

ప్రతి పార్కులోనూ చిన్నారులకోసం ప్రత్యేకంగా ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో క్రికెట్ వంటి ఆటలు ఆడుతూ పిల్లలు మానసిక ఉల్లాసం పొందుతున్నారు. జిమ్​లో ఉండే సామగ్రి కూడా అందుబాటులో ఉండటంతో పార్కుల్లోనే కసరత్తులు చేస్తున్నారు యువకులు.

ABOUT THE AUTHOR

...view details