ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట తొలగించిన సిబ్బంది ఆందోళన - రహదారిపై రాస్తారోకో

కరోనా విజృంభిస్తున్న సమయంలో వారు ఆసుపత్రిలో పని చేశారు. ప్రాణహాని ఉందని తెలిసినా బెదరక విధులు నిర్వహించారు. ఇప్పుడు వారినే నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలపాలని ఆసుపత్రి ముందే బైఠాయించారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

nellore hospital staff protest
తొలగించిన సిబ్బంది ఆందోళన

By

Published : Nov 7, 2020, 6:30 PM IST

కరోనా ఆపత్కాలంలో విధులు నిర్వహించిన సిబ్బందిని తొలగించడంతో వారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమను అన్యాయంగా తొలగించాలంటూ దాదాపు రెండు గంటలకుపైగా రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంబించింది. వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తతత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details