ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా ఓటమికి నేనే కారణం: పాశం సునీల్ - తెదేపా

రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ.. తన ఓటమికి తాను చేసిన తప్పులే కారణమని నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా అభ్యర్థి పాశం సునీల్ అన్నారు. జగన్ చేసే అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

పాశం సునీల్ కుమార్

By

Published : May 26, 2019, 9:43 AM IST

తాను చేసిన తప్పులే తన ఓటమికి కారణమని నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన పాశం సునీల్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ.. చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి కృషి చేస్తానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన వైయస్ జగన్మోహన్​రెడ్డికి అభినందనలు చెప్పారు. వైకాపా చేయబోయే అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు.

పాశం సునీల్ కుమార్

ABOUT THE AUTHOR

...view details