కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వచ్చే నాలుగు పండుగలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర దినోత్సవాలను పరిమితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జెండా ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, మంత్రి ప్రసంగం, కరోనా సేవకలకు ప్రశంసా పత్రలు అందజేసి వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని ముగిస్తామని వెల్లడించారు.
వినాయక చవితి, మెుహరం వేడుకలు అనుమతులు లేవనీ.. ప్రజలు ఇళ్ల నుంచే పండగులు జరపుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో జరిగే రొట్టెల పండుగకు ఇతర ప్రాంతాల భక్తులెవరినీ అనుమతించటం లేదన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందకు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు.