ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yuvagalam Padayatra: 1900 కి.మీకు చేరుకున్న యువగళం యాత్ర.. సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ భరోసా

Nara Lokesh Yuvagalam Padayatra: లోకేశ్ యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని దాటింది. 1900 కి.మీ.ల మజిలీకి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. గుర్తుగా సాలుచింతలలో ధాన్యం ఆరపోసుకునెందుకు ఫ్లాట్ ఫారాల నిర్మాణానికి హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది.

By

Published : Jul 6, 2023, 10:27 AM IST

Yuvagalam Padayatra
1900 కి.మీకు చేరుకున్న యువగళం యాత్ర.. సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ భరోసా

Nara Lokesh Yuvagalam Padayatra: నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర 147వ రోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సందడిగా సాగింది. డప్పు వాయిద్యాలు. నృత్యాలుతో అభిమానులు లోకేశ్ వెంట నడిచారు.. సాలుచింతల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలు కాగా.. భారీ గజమాలలతో యువనేతకు గ్రామాల్లో జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టి, గుమ్మడికాయలు కొట్టి దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పాదయాత్ర హోరెత్తింది. సాలుచింతల వద్ద పాదయాత్ర 1900 కిలోమీటర్ల మైలురాయికి చేరడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

దారిపొడవునా వినతులు.. అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫామ్స్​ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్​లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. దారిపొడవునా ప్రజల నుంచి యువనేతకు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ 68,294 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం అన్నారు. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందిని అన్నారు.

జగన్ విధానాలపై ఆగ్రహం..పాదయాత్రలో ముందుకు సాగుతున్న నేపద్యంలో. మార్గమద్యలో రైతులు, మీసేవ సిబ్బంది, యానాది సామాజిక వర్గీలు, చేనేత కార్మికులు తమ సమస్యలను లోకేశ్​కు విన్నవించుకున్నారు. సాలుచింతల వద్ద మీడియాతో చిట్​చాట్ నిర్వహించి.. నెల్లూరు నగర ఎమ్మెల్యే భూదందాలకు పాల్పడ్డారంటూ ఆధారాలు విడుదల చేశారు. అనంతరం వ్యాపారులతో సమావేశమై జగన్ అవలంభిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యాపారులు తమ ఇబ్బందులను లోకేశ్​కు విన్నవించుకున్నారు. జగన్ ప్రభుత్వం వ్యాపారాలపై పన్నులు పెంచి వేదింపులకు గురిచేస్తోందని వ్యాపారులు వాపోయారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెంచిన పన్నులు తగ్గించి, వ్యాపారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశామని, వ్యాపారులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఉందన్నారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చి వ్యాపారాలు చేసుకునేందుకు అయ్యే ఖర్చులు తగ్గించేలా తాము చర్యలు తీసుకుంటామనిలోకేశ్ హామీ ఇచ్చారు. 147వ పాదయాత్రలో దాదాపు 16 కిలోమీటర్లు నడిచిన లోకేశ్ , బుచ్చి మండలం చెల్లాయపాళెం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేశారు.

నేటి యాత్ర వివరాలు.. నేడు 148వ రోజు పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు చెల్లాయపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. బుచ్చిరెడ్డిపాలెం, ఇస్కపాలెం, నాగం అంబాపురం, రామాపురం, యల్లాయపాలెం, రాజుపాలెం మీదుగా పీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details