సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. ఆమె పంచే ప్రేమకు అంతే లేదని ఓ తల్లి మరోసారి రుజువు చేసింది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన నిజాముద్దీన్ ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవలె బోధన్ వచ్చిన నిజాముద్దీన్... స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలిసి మార్చి 12న అతనితో నెల్లూరు వెళ్లాడు.
అక్కడ నుంచి మొక్కులు తీర్చుకునేందుకు రహమతాబాద్ దర్గాకు వెళ్లాడు. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ విధిచండంతో అక్కడే చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న తల్లి రజియా ఆందోళన చెందింది. కొడుకు ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఏసీపీ జయపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది.
ఏసీపీ ఇచ్చిన లెటర్‌తో 1400కి.మీ ప్రయాణం