అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం 48వ డివిజన్, బాలాయపల్లి మండలం, ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థను మంత్రి అనిల్, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు, పింఛన్లు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి ఏటా జనవరిలో కొత్త ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు నెల్లూరు నగరంలో 166 సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.
"ప్రజలకు మెరుగైన సేవలే..సచివాలయాల ధ్యేయం" - "ప్రభుత్వ సేవలను ప్రజలకు ... చేరువ చేసేందుకే సచివాలయాల ఏర్పాటు"
నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
"ప్రజలకు మెరుగైన సేవలను ... అందించటమే సచివాలయాల ధ్యేయం"
ఇవీ చదవండి
TAGGED:
SACHIVALAYAM