ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డి అను మేము.. - goutham reddy

నెల్లూరు జిల్లా నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆత్మకూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకపాటి గౌతమ్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌కూ పార్టీ అధినేత జబితాలో చోటు దక్కింది. ఇద్దరూ మొదటిసారి మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న మంత్రులు

By

Published : Jun 8, 2019, 1:58 PM IST

నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. జిల్లా నుంచి మంత్రి హోదా దక్కించుకున్న ఇద్దరూ ఎమ్మెల్యేలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనిల్ తెలుగులో ప్రమాణం చేయగా... మేకపాటి గౌతం రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
అధినేత నమ్మిన కుటుంబం....

ప్రమాణస్వీకారం చేస్తున్న మేకపాటి గౌతం రెడ్డి
ఆత్మకూరు నుంచి రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం ఆది నుంచి వైఎస్ తో సన్నిహితంగా ఉంది. వైఎస్ మరణం తర్వాత వైకాపా ఆవిర్భావం సమయంలో జగన్ కు అండగా నిలిచారు. జగన్ కు నమ్మిన నేతలుగా మేకపాటి కుటుంబానికి గుర్తింపు ఉంది. జిల్లాలో అత్యంత సీనియర్ నేతలు ఉన్నప్పటికీ జగన్...గౌతంరెడ్డికే అవకాశం కల్పించారు.
ఆ వర్గం నుంచి తొలిసారిగా మంత్రి
అనిల్ కుమార్ ప్రమాణస్వీకారం
మంత్రి పదవుల ఎంపికల్లో బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు 50 శాతం కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ వర్గాలకు దక్కే సంఖ్య ఆధారంగా లెక్కలు వేసి...జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై పోటీ చేసి..అతి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. అనిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కటం జిల్లా రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. జిల్లా నుంచి మొదటిసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రిగా అవకాశం లభించినట్లైంది.

ABOUT THE AUTHOR

...view details