అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన... 9 వ డివిజన్లో ఉన్న సమస్యలపై.. స్థానికులతో మాట్లాడారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తాం: మంత్రి అనిల్ - అర్హులందరికి ఇళ్ల స్థలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులందరికి ఇళ్ల స్థలాలు: మంత్రి అనిల్
ఏదైనా కారణం చేత ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోకుంటే... వారు కూడా 90 రోజుల్లో సచివాలయాల్లో తమ పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో 30 వేల మందికి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం 650 ఎకరాల భూమి సేకరించినట్లు మంత్రి వెల్లడించారు.