రానున్న 3 నెలల్లో నెల్లూరులో సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో పర్యటించిన ఆయన సిమెంట్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
నెల్లూరులో 600 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి అనిల్ - రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరులో రానున్న 3 నెలల్లో రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్న మంత్రి అనిల్ యాదవ్ తెలిపారు. బాలాజీనగర్‌లో సిమెంట్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.
నెల్లూరులో సిమెంట్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి అనిల్ కుమార్
TAGGED:
anil kumar yadav latest news