నెల్లూరు జిల్లాలో ఓ డ్రైవర్ లైగింక వేధింపులు భరించలేక... ఆటోను పెట్రోలు పోసి తగల బెట్టిందో మహిళ. ఆటో డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తి తన కూతుర్ని వేధించే వాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. రోజురోజుకూ ఆ డ్రైవర్ వేధింపులు ఎక్కువయ్యాయని... తన కూతురు ఆటో తగలబెట్టి ఎటో వెళ్లిపోయిందని తెలిపింది. ఉదయం నుంచి తమ కూతురు కనిపించటంలేదనీ ఆందోళన వ్యక్తం చేసింది. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇద్దరు పిల్లలతో బాధితురాలు పుట్టింట్లోనే ఉంటుంది.
ఇదీ చదవండి: 'కేసీఆర్కు హేట్సాప్ కాదు... దళితులను పట్టించుకోండి'