"సబ్ కమిటీ నివేదికతో... పోలవరం అక్రమాలు బట్టబయలు" - ap
పోలవరంపై వారం, పది రోజుల్లో సబ్ కమిటీ నివేదిక వస్తుందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. నివేదిక వస్తే పోలవరంలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.
minister-anil-kumar
పోలవరం ప్రాజెక్టుపై వారం, పది రోజుల్లో సబ్ కమిటీ నివేదిక వస్తుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆ నివేదిక వస్తే పోలవరంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు. శాసనసభలో చర్చ సక్రమంగా జరగడం లేదని ప్రతిపక్షాలు చెప్పడం అవాస్తవమన్నారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇస్తున్నామని మంత్రి చెప్పారు.