తక్కువ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించే 'క్రిషితంత్ర పరికరం' నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలోని కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో ఈ పరికరం ఏర్పాటైంది. ప్రగతి యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పరికరం ద్వారా 13 రకాల మట్టి పరీక్షల ఫలితాలను 40 నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది.
భూసార పరీక్షలు నిర్వహించే 'క్రిషితంత్ర పరికరం' ప్రారంభం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో భూసార పరీక్షలు చేసే 'క్రిషితంత్ర పరికరాన్ని' ప్రారంభించారు. మట్టి నమూనా పరీక్షలపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
భూసార పరీక్షల కోసం రైతులు రోజుల తరబడి వేచి చూడకుండా దీని ద్వారా తక్కువ సమయంలో ఫలితాలు తెలుసుకోవచ్చని స్మార్ట్ మట్టి పరీక్ష కేంద్రం నిర్వాహకులు తెలిపారు. మట్టి నమూనా పరీక్షలపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ బాబు, పలువురు అధికారులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి:సాధారణ ఎన్నికల కంటే వైకాపాకు పెరిగిన ఓట్ల శాతం ఎంతంటే..