ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: బావిలో దూకి.. వివాహిత ఆత్మహత్య - నెల్లూరు జిల్లా నేర వార్తలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంవారిచింతల గ్రామంలో ఓ వివాహిత... బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

By

Published : Jul 13, 2021, 12:43 PM IST

బావిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మంచాల వెంగ భవానీ (20)కి ఏడాదిన్నర క్రితం వరికుంటపాడు మండలం తూర్పుచెన్నంపల్లికి చెందిన గురుస్వామితో వివాహమైంది. భవానీ 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు గురుస్వామి సోమవారం గ్రామానికి వెళ్లాడు.

ఈ క్రమంలో గొర్రెలను మేపేందుకు వెళ్లిన సోదరుడు వెంకటేశ్వర్లును టిఫిన్ కోసం ఇంటికి పంపుతానని చెప్పి సమీపంలో ఉండే పొలాల వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి తండ్రికి ఫోన్ చేసి.. అత్తారింటికి వెళ్లేందుకు ఇష్టం లేదని చెప్పింది. తండ్రి నచ్చజెప్పేందకు ప్రయత్నించినా కుదరలేదు. సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గొర్రెలు మేపుకొనే వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వచ్చి మృతదేహన్ని బయటకు తీశారు. సీఐ వి. గిరిబాబు, ఎస్సై సయ్యద్ లతీపున్నీసా సంఘటనా స్థలనానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details