Lovers suicide in Nellore: కలువాయి అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య - Lovers suicide in ap
17:19 January 21
పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
Lovers suicide in Nellore: నెల్లూరు జిల్లా కలువాయి అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కలువాయి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, తులసి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో.. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీరిద్దరు కనబడకపోయేసరికి కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా.. అచూకీ లభించలేదు. అయితే వారిద్దరు ఇవాళ.. కలువాయి సమీప అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:Rape on Girl : పుల్లలేరుకుంటున్న బాలికపై యువకుడి అత్యాచారం...బెదిరింపు...