నెల్లూరు జిల్లా దొరవారిసతరం మండలం బూదూరులో శ్రీ వాయులింగేశ్వరుని ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులోని కలువలు.. చూపరులను కట్టిపడేస్తున్నాయి. మండుటెండల్లో విరబూసిన కలువపూల అందాలు.. కనువిందు చేస్తున్నాయి. పెద్ద పెద్ద ఆకుల నడుమ తెలుపు వర్ణంలో వెలిగిపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసి అక్కడి జనాలు మంత్రముగ్ధులవుతున్నారు. కోనేరులోని నీరు అడగంటకపోవడంతో కలువలతో కోనేరు కొత్తశోభను సంతరించుకుంది.
మండుటెండల్లో కనువిందు చేస్తున్న కలువలు - flowers
మండుటెండల్లో విరబూసిన కలువలు.. కనివిందు చేస్తున్నాయి. పెద్ద పెద్ద ఆకలు నడుమ తెలుపు వర్ణంలో కొలనులో కళకళలాడుతున్నాయి. ఎండలకు వాడిపోకుండా తన సోయగంతో కళ్లు తిప్పుకోకుండా కట్టిపడేస్తున్నాయి.
మండుటెండల్లో కనువిందు చేస్తున్న కలువలు