నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో చిట్టచివరి పాలకమండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ శోభారాణి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో తేదేపా ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి పనులను చేసిందని అన్నారు. రూ. 50 కోట్ల నిధులతో అభివృద్ధి జరగగా... మరో162 కోట్ల నిధులతో తాగునీటి ట్యాంకులు నిర్మిస్తామని తెలిపారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పంచాయతీ నుంచి పురపాలక సంఘం వరకూ జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు.
నాయుడుపేటలో చివరి పాలకమండలి సమావేశం - నాయుడు పేట
చిట్టచివరి పాలకమండలి సభ్యుల సమావేశం నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది.
సభలో మాట్లాడుతున్న శోభారాణి
Last Updated : Jul 2, 2019, 8:10 PM IST