ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోయంబేడుతో ఉలిక్కిపడ్డ గూడూరు

మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ఒక్కసారిగా కోయంబేడు ప్రభావంతో ఉలిక్కిపడింది. కరోనా ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు.

koyembedu affect in gudur with corona positive cases
కోయంబేడు ప్రభావంతో గూడురులో నమోదవుతున్న కరోనా కేసులు

By

Published : May 24, 2020, 5:14 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో... కోయంబేడు ప్రభావంతో వరుసగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దిల్లీ నుంచి పట్టణానికి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకొని రెడ్ జోన్​గా ప్రకటించారు. తర్వాత ఆ పేషంట్ డిశార్జ్ కావడంతో ఆరెంజ్ జోన్​గా ప్రకటించారు.

తాజాగా వారం వ్యవధిలో కోయంబేడు మార్కెట్​తో సంబంధాలు కలిగిన... కోతరుము వీధి, మిట్టపాలెం ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకగా.. పట్టణ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారులు అప్రమత్తమై వీరి కుటుంబ సభ్యులను క్వారంటైన్​కు తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారన్నది గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి దుకాణాలు మూసివేయించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details