రాష్ట్రంలోకి అక్రమంగా కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ను నెల్లూరు జిల్లా కావలి సెబ్ అధికారులు అరెస్టు చేశారు. కావలి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బెంగళూరు నుంచి వస్తుండగా.. ఉదయగిరి నియోజకవర్గం జమ్మలపాలెం వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో 4 మద్యం సీసాలను వారు గుర్తించారు. బస్సు డ్రైవర్ భుజం శ్రీనివాసులును కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు కావలి సెబ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ARREST: డబ్బు కోసం... ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే.. - seb police raids
రాష్ట్రంలోకి ఏదో ఒక విధంగా మద్యం తరలివస్తూనే ఉంది. డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వాళ్లు ఎప్పుడో ఒకసారి సెబ్ అధికారులకు చిక్కి శిక్ష అనుభవించక తప్పదు. ఇవన్నీ ఎలాంటి ఉద్యోగాలు లేనివాళ్లు.. డబ్బు కోసం చేశారనుకోవచ్చు. కానీ మంచి ఉద్యోగం చేసుకుంటూ తప్పుడు పనులు చేయడం.. పోలీసులకు చిక్కి శిక్ష అనుభవించడం ఎంత దారుణమో కదా.. ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది.
ARREST