నాయుడుపేటలో ఆగిన జనశతాబ్ది నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే ప్రయాణికులకు జనశతాబ్ది రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ - చెన్నై, చెన్నై - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును నాయుడుపేటలో ఆపేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఈ మధ్యే అనుమతించారు. ఈ మేరకు.. చెన్నై నుంచి విజయవాడవైపు బయల్దేరిన జనశతాబ్ది రైలును నాయుడుపేట స్టేషన్లో ఈ రోజు తొలిసారి ఆపారు. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు చేరుకున్న రైలును... స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతించారు. రైల్వే అధికారులను సన్మానించారు. ప్రస్తుతం చెన్నై, సూళ్లూరుపేట మధ్య నడుస్తున్న మెమూ రైళ్లను.. త్వరలోనే నాయుడుపేట వరకు పొడిగిస్తారని తెలిపారు.