ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ - nellor

ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే చదరంగం క్రీడ నెల్లూరులో కోలాహలంగా మొదలైంది. ప్రముఖ పట్టణాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ కు ఈసారి నెల్లూరు వేదికైంది. జాతీయ స్థాయిలో రేటింగ్ ఉన్న క్రీడాకారులు ఈ టోర్నమెంట్​లో తలపడుతుండగా.. ఇక్కడి ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్

By

Published : Apr 24, 2019, 5:02 AM IST

అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ నెల్లూరులో ప్రారంభమైంది. రాష్ట్ర, జిల్లా చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక కేరళ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల నుంచి దాదాపు 300 మందికి పైగా క్రీడాకారులు పట్టణానికి విచ్చేశారు.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసేలా ప్రణాళికలు రచిస్తూ ఉత్సహంగా తలపడుతున్నారు. చిన్నారి క్రీడాకారులు పెద్దవారితో సైతం తలపడతూ...తమ ప్రతిభాపటావాలను ప్రదర్శిస్తున్నారు. చదరంగం వల్ల మేదో సంపత్తి పెంపొందడమే కాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుందని క్రీడాకారులు అంటున్నారు.

అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్
టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదరంగానికి ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అవసరమని వారు కోరుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా చెస్ అకాడమీలు ఏర్పాటు చేసి, శాశ్వత సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రముఖ నగరాలకే పరిమితమైన ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ మొదటిసారిగా నెల్లూరులో నిర్వహించడం పట్ల చదరంగ క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులతో పట్టణంలో సందడి నెలకొంది. ఈనెల 29వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. టోర్నమెంట్ లో గెలుపొందే క్రీడాకారులకు 20 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details