నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగంలో భాగంగా.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ఉపగ్రహాన్ని నింగికి పంపనున్నారు. ఆదివారం ఉదయం 6.51 గంటల కు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్రపతి కోవింద్... కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం షార్ చేరుకోనున్నారు. ఆయన పర్యటన అంతా షార్ లోని రెండో గేటు లోపల ఉండేలా అధికారులు రూట్ మాప్ తయారు చేశారు. ఈ నేపథ్యంలో షార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
'చంద్రయాన్-2'కు రాష్ట్రపతి రాక! - శ్రీహరికోట
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట నుంచి ఈ నెల 15 తెల్లవారుఝామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం జరిపేందుకు జోరుగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని... రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వయంగా వీక్షించనున్నారు.
చంద్రయాన్-2 పనులు జోరుగా సాగుతున్నాయి