నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొమ్మనేటూరుకు చెందిన వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.... వైకాపా కష్ట కాలంలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురై వైకాపా అధికారంలోకి రావాలని కష్టపడి పని చేశామన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే వరప్రసాద్ రావు విస్మరిస్తున్నారన్నారు. స్థానికులకు ప్రాధాన్యత లేకుండా గ్రామానికి సంబంధం లేని డబ్బున్న నరేంద్ర రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల పోస్టులకు స్థానికులు ఎంపిక చేసి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గూడూరు ఎమ్మెల్యేపై సొంతపార్టీనేతల గుస్సా - MLA office
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైకాపాలో వర్గ భేదాలు ముదురుతున్నాయి. పార్టీలో ముందునుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. గూడూరు పట్టణం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కార్యాలయం ఎదుట వైకాపా కార్యకర్తల ఆందోళనకు దిగారు.
గూడూరులో ముదురుతున్న వర్గ భేదాలు