నెల్లూరు జిల్లా సంగంలో మద్యం సీసాలు భారీగా పట్టుబడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న 2113 మద్యం సీసాలు, 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం రావడంతో ఎస్సై గోపాల్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తెలడంతో కేసు నమోదు చేశామని బచ్చిరెడ్డి పాలెం సీఐ సురేశ్ తెలిపారు. మద్యం సీసాలు ఏ వైన్ షాప్ నుంచి తీసుకువచ్చారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. పలువురు పరారైనట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో భారీగా మద్యం పట్టివేత - alcohol
నెల్లూరు జిల్లా సంగంలో మద్యం సీసాలు భారీగా పట్టుబడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న 2113 మద్యం సీసాలు, 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
నెల్లూరు జిల్లాలో భారీగా మద్యం పట్టివేత