శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరం గ్రామంలో స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్థానిక అవసరాల మేరా ఎడ్లబండ్లతో అధికార పార్టీ నాయకులు తరలింపులు చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. నది పొడవునా నీటి ప్రవాహం కొనసాగుతున్నా.. ఇసుక తరలింపులు ఆగడం లేదని అంటున్నారు. స్థానిక కంపెనీలకు ఇసుక డిమాండ్ ఏర్పడటంతో అధిక ధరలకు వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని.. రైతులు ప్రజలకు నీరు అందించే నదిలో ఇసుక తోడేయటమేంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వర్ణముఖి నది నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరం గ్రామంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నది నుంచి ప్రతి రోజు 70నుంచి 100 ఎడ్లబండ్లలో ఇసుక తరలించి పలు కంపెనీలకు అమ్ముతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇసుక కొరత ఏర్పడటంతో అధిక ధరలకు వీటిని అమ్ముకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారని.. రైతులు తెలుపుతున్నారు.
స్వర్ణముఖి నది నుంచి ప్రతి రోజు 70 నుంచి 100 ఎడ్లబండ్లలో ఇసుక తరలింపు సాగుతుంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాత్రి వేళల్లో సిమెంటు కంకర ఇసుక మిక్చర్ ప్లాంట్లకు అధికార పార్టీ నాయకులు ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఓ ప్లాంట్ వద్ద భారీ ఎత్తున ఇసుక నిల్వలు ఉంటే ఎస్ఈబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ ఇసుక తరలింపులు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసే ఇసుక తరలింపులు జరుగుతున్నాయని. ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నా కట్టడి కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇసుక సమస్య.. అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు..!