గూడూరు షాదీమంజిల్లో ఇఫ్తార్ విందు - mla varaprasada rao
పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కొనసాగుతున్నాయి. హిందూ, ముస్లింలు ఐక్యంగా విందు చేసుకుంటున్నారు. గూడూరులో జరిగిన కార్యక్రమంలో శాసన సభ్యుడు వరప్రసాద్ రావు పాల్గొన్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు షాదీమంజిల్లో... చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడురులోని ముస్లింలు, మైనారిటీలకు ఇప్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు ముఖ్యఅతిథిగా హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసంలో 40 రోజులు ఉపవాసం ఉండి దీక్షతో అల్లాను ప్రార్ధించుటం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేయటం ఈ జన్మలో చేసుకున్న అదృష్టమని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాండ్ల సురేష్ బాబు తెలిపారు.