నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో తాగు నీరు భారీగా వృథా అవుతోంది. నాయుడు పేట, పెళ్లకూరు, దొరవారితరం మండలాల్లోని జువ్వలపాలెం, బిరదవాడ, శ్రీనివాసపురం, నెల్లబలి, కలగుంట పరిసర ప్రాంతాలకు రాజీవ్ టెక్నాలజీ పథకం ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పెళ్లకూరు తాళ్లవాయిపాడు సువర్ణముఖి నదిలోని పైపులు ద్వారా ఆయా పంచాయతీలోని ఓవర్ హెడ్ ట్యాంకులను నింపి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
గుత్తేదారు నిర్లక్ష్యం...!
అక్కడక్కడ పైపులు మరమ్మతులకు గురవుతున్నా గుత్తేదారు నిర్లక్ష్యగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రాజీవ్ టెక్నాలజీ పథకం నిర్వహణకు గుత్తేదారుకు ఏడాదికి 12లక్షల 60వేలు ముట్టజెబుతున్నా... పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడితో కొన్ని ప్రాంతాలు ఇబ్బందులు పడుతుంటే... నీరున్నా వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విన్నవించుకుంటున్నారు.
గుత్తేదారు నిర్లక్ష్యం... భారీగా తాగునీటి వృథా - WATER LEAKAGE
భూగర్భజలాలు అడుగంటి నీటి సమస్యలు తలెత్తుతుంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గుత్తేదారు నిర్లక్ష్యంతో నీరు నోటి పాలు కాకుండా నేల పాలవుతోంది.
గుత్తేదారు నిర్లక్ష్యం... భారీగా తాగునీటి వృథా