అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలకు నీరు చేరడంతో కైవల్యానది, పంబలేరుకు వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై చేరింది. రహదారులు దెబ్బతిని గుంటలు ఏర్పడడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరి బురదమయం కావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
అల్పపీడన ప్రభావంతో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు తీరం వద్ద సముద్రం 25 అడుగుల వరకు ముందుకు వచ్చింది. తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
భారీ వర్షం