నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేశవనగర్ ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. వేదాయపాళెం, ఎస్పీ కార్యాలయం, కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్, సుబేదారుపేట, వాహబ్ పేట ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మర్రిపాడు మండలంలో ....
వర్షం కారణంగా మర్రిపాడు మండలంలో మొక్కజొన్న, మిరప పంటలు నీటిపాలయ్యాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిరప పంట పూత, పిందె రాలిపోయింది. వర్షం ఇలానే కొనసాగితే మొక్కజొన్న మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో..