ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోతట్టు ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ పర్యటన

నివర్ తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షలకు నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాలి నడకన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Nov 26, 2020, 5:39 AM IST

heavy rain in nellore
లోతట్టు ప్రాంతాలు జలమయం

నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జలమయమైన లోతట్టు ప్రాంతాలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పరిశీలించారు. జోరు వానలోనూ నగరంలోని మన్సూర్ నగర్, వాహబ్ పేట, బర్మాషెల్ గుంత ప్రాంతాలలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామిరెడ్డి కాలువ, గచ్చు కాలువలకు పూడికలు తీయించాలని సూచించారు.

ఇదీ చదవండి: నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: మంత్రి గౌతమ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details