ఏప్రిల్‌లోనే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోంది. ఎండల తీవ్రతకి ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ కోస్తాలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. 2018 - 20 మధ్య పరిశీలిస్తే ఎండల తీవ్రత 3.7 డిగ్రీల అధికంగా నమోదయ్యాయి. రాయలసీమలోనూ 1.2 డిగ్రీలు పెరిగింది. ఇప్పుడు రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9.4 డిగ్రీల వరకు అత్యధికంగా ఉంటున్నాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు 43 డిగ్రీలకు తగ్గటం లేదు. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది ఎండల తీవ్రగా బాగా పెరిగింది. బాపట్లలో 5.5 ఒంగోలులో 5.2 అమరావతి నెల్లూరులో 4.3 విజయవాడలో 4.1 తిరుపతిలో 3.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది మే నాటికి పలు మండలాల్లో 43 డిగ్రీల నుంచి 47.8 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికే ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలకు చేరింది.
నెల్లూరు జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజూవారి పనులు చేసుకునే కూలీలు.. ఎండ తీవ్రతకి అల్లాడిపోతున్నారు. ఏసీలకు గిరాకీ పెరిగిందని దుకాణాలు యజమానాలు చెబుతున్నారు.