నెల్లూరు నగరంలోని హోటల్స్, ఐస్‌క్రీమ్, టీ దుకాణాల్లో కార్పొరేషన్, ఆహార కల్తీ నియంత్రణ అధికారుల ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని తందూరి చికెన్ షాప్‌లో దాదాపు 30 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. ఈ మాంసంలో ఫంగస్ చేరి పాడైందని పేర్కొన్నారు. సింహపురి రుచుల హోటల్లోనూ ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణంతో బొద్దింకలు, ఎలుకలు ఉండటాన్ని గుర్తించారు. దాదాపు 10 హోటల్స్‌లో దాడులు జరిపిన అధికారులు... 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. పలు హోటల్స్‌కు నోటీసులు జారీ చేసి, తాత్కాలికంగా సీజ్ చేశారు. పరిస్థితి మెరుగుపడకుంటే శాశ్వతంగా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
హోటల్స్‌లో తింటున్నారా... అయితే జాగ్రత్త! - కార్పొరేషన్, ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీలు
బయటకెళ్లి హోటల్లో తింటున్నారా! ఇక మీదట జాగ్రత్త పడండి. ఆకలేస్తోంది.. ఏదో ఒకటి తిందామనుకుంటే అనారోగ్యం తప్పదు. ఈ విషయాన్ని నెల్లూరు నగరంలోని పలు హోటల్స్‌ను తనిఖీ చేసిన అధికారులు తెలిపారు.
కార్పొరేషన్, ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీలు
TAGGED:
నెల్లూరు నగరం